ఏంటక్కా ఇది.. బావ గురించి తెలియదా? : షెర్లిన్

దిశ, సినిమా : హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా శిల్పా శెట్టిపై ఫైర్ అయింది. శిల్పా భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో తాజాగా సప్లిమెంటరీ చార్జ్ షీట్ ఫైల్ కాగా దీనిపై మీడియా ప్రశ్నించింది. ఈ విషయంపై రియాక్ట్ అయిన ఆమె.. తన ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నానని, రాజ్ కుంద్రా ఏం చేస్తున్నాడో తనకు తెలియదని సమాధానం ఇచ్చింది. దీంతో ఈ కేసులో స్టేట్‌మెంట్ ఇచ్చిన షెర్లిన్ చోప్రా ట్విట్టర్ వేదికగా శిల్పాను విమర్శించింది. ‘కొన్ని […]

Update: 2021-09-17 01:23 GMT

దిశ, సినిమా : హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా శిల్పా శెట్టిపై ఫైర్ అయింది. శిల్పా భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో తాజాగా సప్లిమెంటరీ చార్జ్ షీట్ ఫైల్ కాగా దీనిపై మీడియా ప్రశ్నించింది. ఈ విషయంపై రియాక్ట్ అయిన ఆమె.. తన ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నానని, రాజ్ కుంద్రా ఏం చేస్తున్నాడో తనకు తెలియదని సమాధానం ఇచ్చింది. దీంతో ఈ కేసులో స్టేట్‌మెంట్ ఇచ్చిన షెర్లిన్ చోప్రా ట్విట్టర్ వేదికగా శిల్పాను విమర్శించింది. ‘కొన్ని నివేదికల ప్రకారం, తన భర్త దుర్మార్గపు కార్యకలాపాల గురించి తెలియదని దీదీ చెబుతోంది. కుంద్రా ఆస్తుల గురించి కూడా తెలియదని అంటోంది. ఈ ప్రకటన ఎంతవరకు నిజం, మీరు అర్థం చేసుకోగలరు కదా’ అంటూ సెటైర్లు వేసింది. చేతిలో డంబెల్స్‌తో ఎక్సర్‌సైజ్ చేస్తూనే శిల్పాను కామెంట్ చేసిన షెర్లిన్‌పై జోక్స్ వేసుకుంటున్నారు నెటిజన్లు.

Tags:    

Similar News