27న జైలు నుంచి శశికళ విడుదల!

దిశ,వెబ్‌డెస్క్: మాజీ ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ ఈ నెల 27న జైలు నుంచి విడుదల కానున్నారు. శశికళ నాలుగేండ్ల జైలు శిక్ష 27తో ముగియనున్నట్టు ఆమె తరఫు న్యాయవాది రాజు సేతు పాండియన్ తెలిపారు. అయితే ఆమె మళ్లీ అన్నాడీఎంకేలోకి రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ వార్తలను సీఎం పళనీ స్వామి తోసిపుచ్చారు. అలాంటి అవకాశమే లేదని ఆయన అన్నారు. వంద శాతం ఆమెను పార్టీలో చేర్చుకోబోమని తేల్చిచెప్పారు. ఆమెను పార్టీ […]

Update: 2021-01-19 11:01 GMT

దిశ,వెబ్‌డెస్క్: మాజీ ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ ఈ నెల 27న జైలు నుంచి విడుదల కానున్నారు. శశికళ నాలుగేండ్ల జైలు శిక్ష 27తో ముగియనున్నట్టు ఆమె తరఫు న్యాయవాది రాజు సేతు పాండియన్ తెలిపారు. అయితే ఆమె మళ్లీ అన్నాడీఎంకేలోకి రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ వార్తలను సీఎం పళనీ స్వామి తోసిపుచ్చారు. అలాంటి అవకాశమే లేదని ఆయన అన్నారు. వంద శాతం ఆమెను పార్టీలో చేర్చుకోబోమని తేల్చిచెప్పారు. ఆమెను పార్టీ నుంచి ఎప్పుడో బహిష్కరించామని తెలిపారు.

Tags:    

Similar News