షారుఖ్ టీనేజ్ పిక్ వైరల్..

ఇప్పటివరకు 80కి పైగా సినిమాల్లో నటించిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. కింగ్ ఆఫ్ బాలీవుడ్‌గా ఎదిగాడు. ఫౌజి సీరియల్‌తో యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసిన షారుఖ్.. 1992లో దీవానా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. చాలెంజింగ్ రోల్స్ చేస్తూనే కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. సినిమాల్లోకి రాకముందు.. షారుఖ్ టీనేజ్‌లో ఉన్పప్పటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో గజిబిజి జుట్టుతో […]

Update: 2020-05-27 03:08 GMT

ఇప్పటివరకు 80కి పైగా సినిమాల్లో నటించిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. కింగ్ ఆఫ్ బాలీవుడ్‌గా ఎదిగాడు. ఫౌజి సీరియల్‌తో యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసిన షారుఖ్.. 1992లో దీవానా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. చాలెంజింగ్ రోల్స్ చేస్తూనే కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు.

సినిమాల్లోకి రాకముందు.. షారుఖ్ టీనేజ్‌లో ఉన్పప్పటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో గజిబిజి జుట్టుతో ఉన్న బాద్‌షా.. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నప్పటి ఫొటో అది. స్కూల్ లో డిస్టింక్షన్‌లో పాసైన షారుఖ్.. హన్స్‌రాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత జామియా మిలియా ఇస్లామియా కాలేజ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేసినా యాక్టింగ్ కోర్స్‌లో చేరేందుకు చదువు మధ్యలోనే ఆపేశాడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొంది.. థియేటర్ ఆర్టిస్ట్‌గా చేసిన షారుక్.. ఆ తర్వాత నటుడిగా కెరియర్ ప్రారంభించారు.

చివరగా జీరో సినిమాలో కనిపించిన షారుఖ్.. పలు ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టాడు. తన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ ద్వారా కామ్యాబ్ సినిమా నిర్మించడంతోపాటు అభిషేక్ బచ్చన్ హీరోగా నిర్మించిన బాబ్ బిశ్వాస్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags:    

Similar News