వార్న్ ఔదార్యం.. కరోనా నిరోధానికి సాయం !

ప్రపంచమంతా కరోనా మహమ్మారి బారిన పడిన వేళ శానిటైజర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఉపయోగించే ఆల్కహాల్ బేస్డ్ మెడికల్ శానిటైజర్ల కొరత ఎక్కువగా ఉంది. దీంతో ఆస్ట్రేలియా ప్రధాని ‘స్కాట్ మోరిసన్’ డిస్టిలరీ కంపెనీలను శానిటైజర్లు తయారు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రధాని పిలుపు మేరకు ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్ వ్యాపార భాగస్వామిగా ఉన్న ఒక డిస్టిలరీ కంపెనీ తమ ‘708’ బ్రాండ్ జిన్ తయారీని నిలిపివేసి.. మెడికల్ శానిటైజర్ల తయారీ మొదలు […]

Update: 2020-03-20 01:04 GMT

ప్రపంచమంతా కరోనా మహమ్మారి బారిన పడిన వేళ శానిటైజర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఉపయోగించే ఆల్కహాల్ బేస్డ్ మెడికల్ శానిటైజర్ల కొరత ఎక్కువగా ఉంది. దీంతో ఆస్ట్రేలియా ప్రధాని ‘స్కాట్ మోరిసన్’ డిస్టిలరీ కంపెనీలను శానిటైజర్లు తయారు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ప్రధాని పిలుపు మేరకు ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్ వ్యాపార భాగస్వామిగా ఉన్న ఒక డిస్టిలరీ కంపెనీ తమ ‘708’ బ్రాండ్ జిన్ తయారీని నిలిపివేసి.. మెడికల్ శానిటైజర్ల తయారీ మొదలు పెట్టింది. వాటిని పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. ఈ మేరకు వార్న్ తన ట్విట్టర్ ఖాతాలో మీడియా నోట్ రిలీజ్ చేశాడు. ‘708 టీమ్ చేస్తున్న ఈ గొప్ప పనికి తాను ఎంతో గర్విస్తున్నానని.. ఇతరులకు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని’ వార్న్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

Tags: Shane Warne, Cricketer, Medical Sanitiser, Distillery company, 708 Brand Gin

Tags:    

Similar News