అర్ధరాత్రి వెళ్లి మరీ ఆకలి తీర్చాడు

దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న కొన్ని కుటుంబాలను శంషాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బండి గోపాల్ యాదవ్ ఆదుకున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి అవుటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రహదారిపై తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొన్ని కుటుంబాలు ఆకలికి అలమటిస్తున్నాయనే విషయం స్థానిక పోలీసులు ద్వారా తెలుసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తన ఇంట్లో భోజనాన్ని తయారు చేసుకుని స్వయంగా వెళ్లి వారి కుటుంబాలకు అందజేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ బీహార్, ఆంధ్రప్రదేశ్‌కు […]

Update: 2020-04-17 06:21 GMT

దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న కొన్ని కుటుంబాలను శంషాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బండి గోపాల్ యాదవ్ ఆదుకున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి అవుటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రహదారిపై తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొన్ని కుటుంబాలు ఆకలికి అలమటిస్తున్నాయనే విషయం స్థానిక పోలీసులు ద్వారా తెలుసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తన ఇంట్లో భోజనాన్ని తయారు చేసుకుని స్వయంగా వెళ్లి వారి కుటుంబాలకు అందజేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ బీహార్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కూలీల కుటుంబాలకు వ్యాపారవేత్త శీనయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

Tags: Shamshabad,Muncipal,vice chairman,distribute food

Tags:    

Similar News