బదిలీపై వచ్చి.. ఏసీబీకి చిక్కిన షాబాద్ సీఐ

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శంకరయ్య యాదవ్ గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఇటీవలే షాబాద్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన శంకరయ్య గతంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో పనిచేశారు. గతం నుంచే ఆయనపై ఆరోపణలున్నాయి. షాద్‌నగర్‌ పనిచేసిన సమయంలో భూఅక్రమాలు, భూ వివాదాల లాంటి కేసులో తలదూర్చి లంచం తీసుకుంటారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలపై సైబరాబాద్ కమీషనర్ దృష్టి సాధించి నిర్ధారించారు. దీంతో శంకరయ్య యాదవ్‌ను […]

Update: 2020-07-09 02:17 GMT

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శంకరయ్య యాదవ్ గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఇటీవలే షాబాద్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన శంకరయ్య గతంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో పనిచేశారు. గతం నుంచే ఆయనపై ఆరోపణలున్నాయి. షాద్‌నగర్‌ పనిచేసిన సమయంలో భూఅక్రమాలు, భూ వివాదాల లాంటి కేసులో తలదూర్చి లంచం తీసుకుంటారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలపై సైబరాబాద్ కమీషనర్ దృష్టి సాధించి నిర్ధారించారు. దీంతో శంకరయ్య యాదవ్‌ను సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు.

ఆ తర్వాత తిరిగి షాబాద్ సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ అవకాశం కల్పించినప్పటికీ ఏసీబీకి పట్టుబడటం విశేషం. రాజేంద్రనగర్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ… షాబాద్ మండలం సోలిపేట గ్రామానికి చెందిన విజయ్ మోహన్ రెడ్డికి సంబంధించిన భూ విషయంలో వివాదం పరిష్కారించేందుకు సీఐ శంకరయ్య యాదవ్, ఏఎస్ఐ రాజేందర్లు లంచం డిమాండ్ చేశారు. ఈ విషయంపై ముందుగానే ఫిర్యాదు స్వీకరించి షాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం జరిగిందన్నారు. ఆ సమయంలో రూ.1.20లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి శంకరయ్య అడ్డంగా దొరికినట్లు తెలిపారు. సీఐ శంకరయ్యతో పాటు ఏఎస్ఐ రాజేందర్ సైతం ఉన్నట్లు వివరించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News