మహబూబ్‌నగర్‌లో అకస్మాత్తుగా ఘటన

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా మూడు షాపులు కూలిపోయాయి. అయితే ఉదయం సమయం కావడంతో పెను ప్రమాదం తపింది. వివరాల వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తూర్పు కమాన్ సమీపంలోని మాడ్రన్ రైతు బజార్ సమీపంలో గల మూడు షాపులు ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో సమీపంలో కూరగాయలు కొంటున్న జనం భయబ్రాంతులకు గురయ్యారు. షాపులు కూలిన సమయంలో సమీపంలో మనుషులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. […]

Update: 2020-07-27 23:52 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా మూడు షాపులు కూలిపోయాయి. అయితే ఉదయం సమయం కావడంతో పెను ప్రమాదం తపింది. వివరాల వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తూర్పు కమాన్ సమీపంలోని మాడ్రన్ రైతు బజార్ సమీపంలో గల మూడు షాపులు ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో సమీపంలో కూరగాయలు కొంటున్న జనం భయబ్రాంతులకు గురయ్యారు.

షాపులు కూలిన సమయంలో సమీపంలో మనుషులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రధాన రహదారిపై ఉన్న ఈ షాపులు ఉదయం సమయంలో కూలడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అలాగే రోడ్డుకు అవతలి వైపు ఉన్న మార్కెట్ కి వచ్చేవారు కూడా ఇక్కడే బైకులు నిలుపుతుంటారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తపింది. కూలిన గోడల కింద 3 బైకులు ఉన్నట్టు సమాచారం. అయితే షాపులు పురాతన కట్టడాలు కావడం.. ఇటీవల కురిసిన వరుస వర్షాలకు గోడలు నాని కూలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News