ఇటాలియన్ ఓపెన్ నుంచి వైదొలగిన సెరేనా

దిశ, స్పోర్ట్స్ : యూఎస్ ఓపెన్‌ (US Open)లో సెమీస్‌లోనే వెనుదిరిగిన సెరేనా విలియమ్స్ మరో టోర్నీ నుంచి వైదొలగింది. సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న ఇటాలియన్ ఓపెన్ (Italian Open) నుంచి చీలమండ గాయంతో వైదొలగుతున్నట్లు పేర్కొన్నది. ఇటాలియన్ ఓపెన్ (Italian Open) ముగిసిన వెంటనే ఫ్రెంచ్ ఓపెన్ (French Open) ప్రారంభం కానుంది. ఆ గ్రాండ్ స్లామ్‌లో ఆడటానికి వీలుగా గాయం నుంచి కోలుకోవడానికి తగినంత విశ్రాంతి కోసం ఇటాలియన్ ఓపెన్ (Italian […]

Update: 2020-09-13 08:56 GMT

దిశ, స్పోర్ట్స్ : యూఎస్ ఓపెన్‌ (US Open)లో సెమీస్‌లోనే వెనుదిరిగిన సెరేనా విలియమ్స్ మరో టోర్నీ నుంచి వైదొలగింది. సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న ఇటాలియన్ ఓపెన్ (Italian Open) నుంచి చీలమండ గాయంతో వైదొలగుతున్నట్లు పేర్కొన్నది. ఇటాలియన్ ఓపెన్ (Italian Open) ముగిసిన వెంటనే ఫ్రెంచ్ ఓపెన్ (French Open) ప్రారంభం కానుంది.

ఆ గ్రాండ్ స్లామ్‌లో ఆడటానికి వీలుగా గాయం నుంచి కోలుకోవడానికి తగినంత విశ్రాంతి కోసం ఇటాలియన్ ఓపెన్ (Italian Open)నుంచి వైదొలగుతున్నట్లు సెరేనా తెలిపింది. యూఎస్ ఓపెన్ సెమీస్‌లో మూడో సెట్‌లో కూడా సెరేనా మెడికల్ టైమ్ అవుట్ (Medical time out) తీసుకున్నది. ఎడమ కాలి మడమకు చికిత్స తీసుకొని ఆడింది. అజరెంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో తొలి సెట్ గెలిచిన తర్వాత కోర్టులో కాస్త ఇబ్బందిగానే కలిగింది. గాయం మరింత పెరిగితే ఫ్రెంచ్ ఓపెన్ ఆడటం కష్టం కావొచ్చని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

Tags:    

Similar News