విదేశీయులకు సపరేటు ట్రీట్‌మెంట్.. ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం

దిశ, తెలంగాణ బ్యూరో: ఇక నుంచి విదేశీయులకు అన్ని ఆసుపత్రుల్లో వేర్వేరుగా చికిత్సను అందించాలని ఆరోగ్యశాఖ సూచించింది. ఎట్​ రిస్క్​, నాన్ ​రిస్క్ ​అనే తేడా లేకుండా విదేశాల హిస్టరీ ఉన్నోళ్లందరికీ ఇదే విధానం అమలు చేయాలన్నది. ప్రభుత్వ, ప్రైవేట్​ లో వేర్వేరుగా ఓపీ నిర్వహించాలని అంతర్గత ఆదేశాలిచ్చింది. అంతేగాక ఇన్​పేషెంట్లకు కూడా సపరేట్​గా ట్రీట్​మెంట్​ చేయాలన్నది. అనారోగ్యంతో ఎవరూ ఆసుపత్రులకు వచ్చినా ఈ సిస్టంను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒమిక్రాన్​ వ్యాప్తి కంట్రోల్​ కొరకే ఈ […]

Update: 2021-12-19 16:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇక నుంచి విదేశీయులకు అన్ని ఆసుపత్రుల్లో వేర్వేరుగా చికిత్సను అందించాలని ఆరోగ్యశాఖ సూచించింది. ఎట్​ రిస్క్​, నాన్ ​రిస్క్ ​అనే తేడా లేకుండా విదేశాల హిస్టరీ ఉన్నోళ్లందరికీ ఇదే విధానం అమలు చేయాలన్నది. ప్రభుత్వ, ప్రైవేట్​ లో వేర్వేరుగా ఓపీ నిర్వహించాలని అంతర్గత ఆదేశాలిచ్చింది. అంతేగాక ఇన్​పేషెంట్లకు కూడా సపరేట్​గా ట్రీట్​మెంట్​ చేయాలన్నది. అనారోగ్యంతో ఎవరూ ఆసుపత్రులకు వచ్చినా ఈ సిస్టంను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒమిక్రాన్​ వ్యాప్తి కంట్రోల్​ కొరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు, ఇతర ఏ అనారోగ్య లక్షణాలున్నా వెంటనే ఆర్టీపీసీఆర్​ నిర్వహించాలన్నది. పాజిటివ్​ తేలినోళ్ల నమూనాలను వెంటనే జీనోమ్​ సీక్వెన్సింగ్​కు పంపాలన్నది. అంతేగాక ప్రతీ వ్యక్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని నొక్కి చెప్పింది.

వ్యాప్తి నియంత్రణకే..

ఒమిక్రాన్​ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తతో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఆసుపత్రులు హాట్​ స్పాట్​గా మారకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మొదటి, రెండవ వేవ్​లలో ఉన్నట్లే వేర్వేరు ఓపీ , ఇన్​పేషెంట్​ విధానాలను అమలు చేయాలనుకుంటున్నది. లేదంటే స్థానిక రోగులతో విదేశీయులు కలవడం వలన వ్యాప్తి రెట్టింపు అయ్యే ప్రమాదం ఉన్నది. మరోవైపు 6 రెట్లు అదనంగా వ్యాప్తి అంటే ఆసుపత్రులన్నీ ఒమిక్రాన్​ ప్రభావంతో అల్లాడిపోయే అవకాశం ఉన్నది. దీంతోనే సపరేట్​ ట్రీట్​మెంట్​ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News