స్వల్ప లాభాల్లో ముగిసిన ఈక్విటీ మార్కెట్లు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) గురువారం స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. విదేశీ మార్కెట్ల (Foreign markets)నుంచి సానుకూల సంకేతాలతో వరుస నాలుగు రోజుల పాటు జోరు కొనసాగించిన మార్కెట్లు చివర్లో నీరసించాయి. ప్రారంభంలో భారీగా లాభపడినప్పటికీ, మిడ్ సెషన్ (Mid session) అనంతరం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. చివరి వరకు ఇదే ధోరణి కొనసాగడంతో మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. మార్కెట్లు (Markets) ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex)39.55 పాయింట్లు లాభపడి […]

Update: 2020-08-27 07:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) గురువారం స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. విదేశీ మార్కెట్ల (Foreign markets)నుంచి సానుకూల సంకేతాలతో వరుస నాలుగు రోజుల పాటు జోరు కొనసాగించిన మార్కెట్లు చివర్లో నీరసించాయి. ప్రారంభంలో భారీగా లాభపడినప్పటికీ, మిడ్ సెషన్ (Mid session) అనంతరం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

చివరి వరకు ఇదే ధోరణి కొనసాగడంతో మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. మార్కెట్లు (Markets) ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex)39.55 పాయింట్లు లాభపడి 39,113 వద్ద ముగియగా, నిఫ్టీ (Nifty) 9.65 పాయింట్ల లాభంతో 11,559 వద్ద ముగిసింది. ప్రధానంగా రియల్టీ రంగం (Realty sector)షేర్లు దూసుకెళ్లాయి. కరోనా నేపథ్యంలో సవాళ్లను ఎదుర్కొంటున్న రియల్టీ రంగానికి ఊతమిచ్చేలా మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని 5 నుంచి 2 శాతానికి తగ్గించింది.

అంతేకాకుండా, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు స్టాంప్ డ్యూటీని 3 శాతమే విధించనున్నట్టు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతానికి 4 నుంచి 1 శాతానికి తగ్గించింది. ఈ కారణంగానే స్టాక్ మార్కెట్లో (stock market) రియల్టీ రంగం షేర్లు భారీగా ఎగిసి 6.63 శాతం లాభపడింది. నిఫ్టీ (Nifty)లో ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, మీడియా, ఫార్మా రంగాలు సానుకూలంగా ట్రేడవ్వగా, ఐటీ, ఎఫ్ఎంసీజీ నీరసించాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌ (Sensex Index)లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, మారుతీ సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎల్అండ్‌టీ, టైటాన్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాలను నమోదు చేయగా, ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో, రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, నెస్లె ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 73.81 వద్ద ఉంది.

Tags:    

Similar News