వివేకా హత్యకేసులో సంచలనం, జగన్ సొంత మేనమామ విచారణకు

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్‌లో 90వ రోజు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా శనివారం కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. అతిథిగృహంలో సీబీఐ రవీంద్రనాథ్ రెడ్డిని విచారించింది. హత్యకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యేను ప్రశ్నించింది. ఇటీవల వివేకా హత్యకేసులో సీబీఐ అనేకమందిని విచారిస్తూ కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అనేకమందిని విచారించిన సంగతి తెలిసిందే. […]

Update: 2021-09-04 10:35 GMT

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్‌లో 90వ రోజు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా శనివారం కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. అతిథిగృహంలో సీబీఐ రవీంద్రనాథ్ రెడ్డిని విచారించింది. హత్యకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యేను ప్రశ్నించింది. ఇటీవల వివేకా హత్యకేసులో సీబీఐ అనేకమందిని విచారిస్తూ కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అనేకమందిని విచారించిన సంగతి తెలిసిందే. ఇకపోతే వైఎస్ వివేకా హత్య కేసులో తొలిసారిగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. రవీంద్రనాథ్ రెడ్డి సీఎం జగన్‌కు స్వయానా మేనమామ కావడం గమనార్హం.

Tags:    

Similar News