పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభం

దిశ, తెలంగాణ బ్యూరో: పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవలను తిరిగి ప్రారంభించినట్టుగా సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి బాలయ్య ప్రకటించారు. జూన్ 10 (గురువారం) నుంచి సేవలను పునరుద్ధరించామని తెలిపారు. కరోనా వ్యాధివ్యాప్తి దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రధాన పాస్ పోస్ట్ కేంద్రాలతో పాటు మరో 14 పోస్టాఫీసుల్లోని పాస్ పోర్ట్ సేవలను నిలిపివేసామని చెప్పారు. ఈ నెల 1 నుంచి బేగంపేట, అమీర్ పేట, టోలీచౌకీ, నిజామాబాద్, కరీంనగర్ పాస్‌పోర్ట్ కేంద్రాల్లో సేవలను అందిస్తున్నామని తెలిపారు. […]

Update: 2021-06-10 08:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవలను తిరిగి ప్రారంభించినట్టుగా సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి బాలయ్య ప్రకటించారు. జూన్ 10 (గురువారం) నుంచి సేవలను పునరుద్ధరించామని తెలిపారు. కరోనా వ్యాధివ్యాప్తి దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రధాన పాస్ పోస్ట్ కేంద్రాలతో పాటు మరో 14 పోస్టాఫీసుల్లోని పాస్ పోర్ట్ సేవలను నిలిపివేసామని చెప్పారు. ఈ నెల 1 నుంచి బేగంపేట, అమీర్ పేట, టోలీచౌకీ, నిజామాబాద్, కరీంనగర్ పాస్‌పోర్ట్ కేంద్రాల్లో సేవలను అందిస్తున్నామని తెలిపారు.

తాజాగా లాక్‌డౌన్ సాయంత్రం 5గంటల వరకు సడలిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో అన్ని కేంద్రాల్లో సేవలు ప్రారంభించామని చెప్పారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబాబాద్, కామారెడ్డి, వికారాబాద్, వనపర్తి, మేడ్చల్ జిల్లాలోలోని పోస్టాఫీసుల్లో గల పాస్‌పోర్ట్ కార్యాలయాలను తిరిగి ప్రారంభించామని వివరించారు.

Tags:    

Similar News