వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ..ఇక చౌకగా రుణాలు!

దిశ, వెబ్‌డెస్క్: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు వినియోగదారులకు శుభవార్త అందించింది. నిధుల వ్యయానికి అనుగుణంగా రుణాలపై వడ్డీ రేటు(ఎమ్‌సీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ సవరణతో వార్షిక ఎమ్‌సీఎల్ఆర్ 7.40 శాతం నుంచి 7.25 శాతానికి దిగొచ్చింది. ఎమ్‌సీఎల్ఆర్‌తో అనుసంధానం ఉన్న రుణాలు తీసుకున్న వారికి లబ్ధి చేకూరనుంది. సవరించిన వడ్డీ రేటు మే 10 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. మూడేళ్ల […]

Update: 2020-05-07 07:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు వినియోగదారులకు శుభవార్త అందించింది. నిధుల వ్యయానికి అనుగుణంగా రుణాలపై వడ్డీ రేటు(ఎమ్‌సీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ సవరణతో వార్షిక ఎమ్‌సీఎల్ఆర్ 7.40 శాతం నుంచి 7.25 శాతానికి దిగొచ్చింది. ఎమ్‌సీఎల్ఆర్‌తో అనుసంధానం ఉన్న రుణాలు తీసుకున్న వారికి లబ్ధి చేకూరనుంది. సవరించిన వడ్డీ రేటు మే 10 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. మూడేళ్ల కాలవ్యవధి ఉన్న రిటైల్ టర్మ్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఈ తగ్గింపులు మే 12 నుంచి అమల్లోకి వస్తాయి.

పెద్దలకు గౌరవం..

సీనియర్ సిటిజన్ల కోసం అధిక వడ్డీని అందించే ప్రత్యేక డిపాజిట్ పథకానికి ఎస్‌బీఐ శ్రీకారం చుట్టింది. డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గుతున్న తరుణంలో సీనియర్ సిటిజన్లకు ఊరట ఇచ్చేందుకు ‘ఎస్‌బీఐ వియ్ కేర్ డిపాజిట్’ పేరుతో రిటైల్ టర్మ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. దీనికి ఐదేళ్లూ, అంతకంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై 30 బేసిస్ పాయింట్లను అదనంగా వడ్డీని చెల్లించనున్నారు. ఈ పథకం సెప్టెంబర్ 30 వరకూ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

Tags: Bank, Lending Rate, SBI, SBI Rate Cut, State Bank Of India

Tags:    

Similar News