చిరంజీవి అవ్వాలనుకుంటున్నాను: సత్యదేవ్

దిశ, వెబ్ డెస్క్: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘జ్యోతిలక్ష్మి’ ఆ మూవీలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ‘సత్యదేవ్’. చిన్న క్యారెక్టర్ ఇచ్చినా వంద శాతం న్యాయం చేయగల నటుడు సత్యదేవ్. బ్రోచేవారెవరు రా, అంతరిక్షం, సరిలేరు నీకెవ్వరూ ఇలా ప్రతి చిత్రంతోనూ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ‘బ్లఫ్ మాస్టర్’సినిమాలో హీరోగానూ తన సత్తా చాటాడు. రీసెంట్‌గా ఈ మూవీని చూసిన మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ గోపీ గణేశ్‌, హీరో సత్యదేవ్‌ను […]

Update: 2020-07-22 04:07 GMT

దిశ, వెబ్ డెస్క్: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘జ్యోతిలక్ష్మి’ ఆ మూవీలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ‘సత్యదేవ్’. చిన్న క్యారెక్టర్ ఇచ్చినా వంద శాతం న్యాయం చేయగల నటుడు సత్యదేవ్. బ్రోచేవారెవరు రా, అంతరిక్షం, సరిలేరు నీకెవ్వరూ ఇలా ప్రతి చిత్రంతోనూ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ‘బ్లఫ్ మాస్టర్’సినిమాలో హీరోగానూ తన సత్తా చాటాడు. రీసెంట్‌గా ఈ మూవీని చూసిన మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ గోపీ గణేశ్‌, హీరో సత్యదేవ్‌ను ప్రత్యేకంగా ఇంటికి పిలిచి మాట్లాడారు. వారిని అభినందించారు. ఈ విషయాన్ని హీరో సత్యదేవ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. చిన్ననాటి నుంచి చిరంజీవిని ఎంతగానో ఆరాధించే సత్యదేవ్, చిరుపై ఉన్న అభిమానాన్ని ఓ లెటర్ ద్వారా వివరించారు.

‘‘నా చిన్న‌ప్పుడు మా క్లాస్ రూం గోడ మీద ఒక పెద్ద స్కేల్ బొమ్మ ఉండేది. అర‌డుగుల దాకా గీసి ఆపేశారు. రెండు, మూడు నెల‌ల‌కొక‌సారి ఎంత పొడ‌వు పెరిగామో కొల‌వ‌టానికి ఒక్కొక్క‌రినీ గోడ‌కు అనుకుని నిల‌బ‌డ‌మ‌నేవారు. ఒక‌రోజు టీచ‌ర్‌ని ‘మాలో ఎవ‌రైనా ఆ సీలింగ్ క‌న్నా పొడ‌వు పెరిగితే ఎలా టీచ‌ర్‌’ అని అడిగాను. ‘నువ్వేమన్నా చిరంజీవి అనుకుంటున్నావా’. ఆ తర్వాత చాలాసార్లు చాలా చోట్ల అవే మాటలు విన్నాను. కష్టతరం, అసాధ్యం అనిపించే పనులు చేయడానికి ఎవరు పూనుకున్నా చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరో ఒకరు అనే మాటలు అవి. నేను సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు అదే ప్రశ్న ఎదురుపడింది.

‘నేను చిరంజీవి’ అనుకోలేదు. కొన్ని కోట్ల మందిలాగా చిరంజీవి అవ్వాలనుకుంటున్నాను. నేను ఏమీ సాధించాను? ఎంత సాధించాలి? అని కొల‌వ‌డానికి నా లైఫ్ గోడ మీద నేను గీసుకున్న స్కేల్ చిరంజీవి. ఎవ‌రెస్ట్ ఎక్క‌డానికి బ‌య‌లు దేరిన ప్ర‌తి ఒక్క‌డికీ అనుమానాలు, భ‌యాలు త‌ప్ప‌వు. దారిలో ఊహించ‌ని అడ్డంకులు. కుంగ‌దీసే గాయాలు. ‘ఇక నా వల్ల కాదు’ అని వెనక్కు తిరిగి పోవాలనుకున్నప్పుడు ఆ శిఖరం మీదున్న జెండా కనిపిస్తుంది. ఏదో తెలియని ధైర్యం వస్తుంది. శక్తిని పుంజుకుని మళ్లీ ప్రయాణం కొనసాగిస్తాం. తెలుగు సినిమాల్లోకి నటుడవ్వాలని వచ్చిన నాలాంటి వేల మందికి ‘చిరంజీవి’ అనే వ్యక్తి ఆ జెండా. మొన్న జూలై 8న చిరంజీవి గారిని వాళ్ల ఇంట్లో కలిశాను. ఆ యూఫోరియా నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు. కలలాగానే ఉంది. సర్.. మీరు నాకు చెప్పిన ప్రతి మాటా గుర్తుంది. భద్రంగా నా మనసులో దాచుకుంటాను. ‘చిరంజీవిగారిని కలవడానికి వెళ్తున్నాను’ అని చెప్పినప్పుడు మా ఇంట్లో వాళ్ల నుంచి అదే ప్రశ్న ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా’’ అని తన అభిమానాన్ని చిరంజీవికి తెలిపారు హీరో సత్యదేవ్.

సత్యదేవ్ మాటలపై పూరి జగన్నాథ్ కూడా స్పందించారు. ‘అన్నయ్య నిన్ను ఎంత ఇన్‌స్పైర్ చేసి ఉంటారో నేను ఊహించగలను. రాసిపెట్టుకో ఈ ఒక్క మీటింగ్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. ’ అని పూరి అన్నారు. దానికి సత్యదేవ్.. ‘సార్ ఎస్ ఎస్.. రెండు దశాబ్దాలకు సరిపడా ఎనర్జీని ఇచ్చారు’ అన్నాడు.

Tags:    

Similar News