రాత్రికి నన్ను రమ్మంటావా..? రాసలీలల నేత ఆడియో లీక్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఒంటరిగా ఉన్న మహిళలకు మాయమాటలు చెప్పి, ప్రభుత్వ పథకాలు ఇప్పస్తామని లోంగదిసుకోవడం.. వినకపోతే బెదిరింపులకు గురిచేస్తున్న ఓ సర్పంచ్ బాగోతం బట్ట బయలైంది. అతడి మితిమీరిన ఆగడాలు బయటకు రావడంతో సర్పంచ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (ఆ ఆడియో సంభాషణ కింద ఉంది వినవచ్చు) వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం గాలిపూర్ గ్రామానికి చెందిన మహిళకు బుధవారం రాత్రి గ్రామ సర్పంచ్ లక్ష్మారెడ్డి ఫోన్ చేసి.. ఒంటరిగా […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఒంటరిగా ఉన్న మహిళలకు మాయమాటలు చెప్పి, ప్రభుత్వ పథకాలు ఇప్పస్తామని లోంగదిసుకోవడం.. వినకపోతే బెదిరింపులకు గురిచేస్తున్న ఓ సర్పంచ్ బాగోతం బట్ట బయలైంది. అతడి మితిమీరిన ఆగడాలు బయటకు రావడంతో సర్పంచ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (ఆ ఆడియో సంభాషణ కింద ఉంది వినవచ్చు)
వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం గాలిపూర్ గ్రామానికి చెందిన మహిళకు బుధవారం రాత్రి గ్రామ సర్పంచ్ లక్ష్మారెడ్డి ఫోన్ చేసి.. ఒంటరిగా ఉన్నావా ఇంటికి రావాలా అని మాట్లాడాడు.
వెంటనే సదరు మహిళ చెప్పు తెగే వరకు కొడతానని సర్పంచ్‌కు వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సంచలనంగా మారింది. అనంతరం ఆమె ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలుపగా.. సర్పంచ్ ఇంటిపై దాడి చేసినట్టు సమాచారం.
అయితే సర్పంచ్ లక్ష్మారెడ్డి గతంలో కూడా కొందరు మహిళలను ఇలానే లోబరచుకున్నట్లు కొందరు బాధిత మహిళలు ఆరోపించారు. ఎవరికైనా చెబితే మీ అంతు చూస్తానని, ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తానని బెదిరించినట్లు బాధితులు పేర్కొన్నారు. గ్రామ ప్రథమ పౌరుడు ఇటువంటి పనులు చేయడం ఏమిటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకుల ఆధిపత్యం గ్రామంలో దళిత బహుజన మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అంబేద్కర్ సంఘం నాయకులు ఆరోపించారు. సర్పంచ్ లక్ష్మారెడ్డిపై ఎస్సీ, ఎస్‌టీ కేసు నమోదు చేసి సదరు మహిళకు రక్షణ కల్పించాలని దళిత సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు నిజాం సాగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.