సీవీసీగా సంజయ్ కొఠారి ప్రమాణం

న్యూఢిల్లీ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజయ్ కొఠారి ‘చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌’ (సీవీసీ)గా శనివారం బాధ్యతలు చేపట్టారు. సంజయ్ చేత దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. మోడీ కాటన్ స్కార్ఫ్‌ను మాస్క్‌గా కట్టుకుని హాజరవ్వగా, మిగతా వారుసైతం మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ.. కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, 1978 బ్యాచ్‌ […]

Update: 2020-04-25 03:25 GMT

న్యూఢిల్లీ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజయ్ కొఠారి ‘చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌’ (సీవీసీ)గా శనివారం బాధ్యతలు చేపట్టారు. సంజయ్ చేత దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. మోడీ కాటన్ స్కార్ఫ్‌ను మాస్క్‌గా కట్టుకుని హాజరవ్వగా, మిగతా వారుసైతం మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ.. కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, 1978 బ్యాచ్‌ హ‌ర్యానా క్యాడ‌ర్‌కు చెందిన సంజయ్ కొఠారి.. సీవీసీ బాధ్యతలు చేపట్టకముందు రాష్ట్రపతి కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాకుండా ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్టు చైర్మన్‌గానూ విధులు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 29న ఆయనను సీవీసీగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

tags: sanjay kothari, cvc, chief vigilance commissioner, ramnath kovind, modi, venkaiah naidu, rashtrapati bhavan

Tags:    

Similar News