మళ్లీ ఈ అధ్యయనాలు ఎందుకో? : సంపత్
దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగవర్గాలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, కమిటీలు, అధ్యయనాలతో కాలయాపన చేయరాదని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమారస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం సీఎం కేసీఆర్ ఉద్యోగులకు వేతన సవరణ, ఇతర అంశాలపై ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేతన సవరణ గురించే వేతన సవరణ కమిషన్ వేశారని, రెండున్నరేండ్లు దాటినా పీఆర్సీ నివేదిక సబ్మిట్ చేయలేదని విమర్శించారు. కనీసం సబ్మిట్ చేయని […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగవర్గాలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, కమిటీలు, అధ్యయనాలతో కాలయాపన చేయరాదని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమారస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం సీఎం కేసీఆర్ ఉద్యోగులకు వేతన సవరణ, ఇతర అంశాలపై ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేతన సవరణ గురించే వేతన సవరణ కమిషన్ వేశారని, రెండున్నరేండ్లు దాటినా పీఆర్సీ నివేదిక సబ్మిట్ చేయలేదని విమర్శించారు. కనీసం సబ్మిట్ చేయని రిపోర్టుపై అధ్యయనం చేసేందుకు అధికారుల కమిటీ వేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియడం లేదన్నారు.
అదేవిధంగా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుతామని నిర్ధిష్టంగా చెబుతూ మేనిఫెస్టోలో పెట్టారని, అలాంటి అంశంపై మళ్లీ చర్చ ఎందుకు, అధ్యయనం ఎందుకని సంపత్ కుమారస్వామి ప్రశ్నించారు. ఈ అధ్యయనాలు, చర్యలు పూర్తి అయ్యేలోగా మళ్లీ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన కోడ్, ఆ తర్వాత పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ చివరకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నివేదికలు, అంశాలన్నీ తెలిసి ఉన్నారని, వెంటనే 65 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు భేషరత్గా పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని టీఈఏ అధ్యక్షుడు సంపత్ కుమారస్వామి డిమాండ్ చేశారు.