RTC చైర్మన్ బాజిరెడ్డి సంచలన నిర్ణయం.. స్వాగతించిన సజ్జనార్

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ నుంచి చైర్మన్ హోదాలో తనకు వచ్చే వేతనాన్ని వదులుకున్నారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు బుధవారం లేఖ అందజేశారు. శాసనసభ్యునిగా తనకు వస్తోన్న జీతం చాలని, TSRTC నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఆర్థికభారం తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ […]

Update: 2021-11-24 05:41 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ నుంచి చైర్మన్ హోదాలో తనకు వచ్చే వేతనాన్ని వదులుకున్నారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు బుధవారం లేఖ అందజేశారు. శాసనసభ్యునిగా తనకు వస్తోన్న జీతం చాలని, TSRTC నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఆర్థికభారం తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. చైర్మన్ హోదాలో వేతనం వదులుకున్న బాజిరెడ్డి నిర్ణయాన్ని ఆర్టీసీ అధికారులు, సూపర్ వైజర్లు, ఉద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News