పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. బస్సులో 40 మంది విద్యార్థులు

దిశ, నిర్మల్ రూరల్: అదుపుతప్పి పంట పొలాల్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన సంఘటన నిర్మల్ జిల్లా మామడ మండలంలో చోటు చేసుకొంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ నుండి మామడ, ఫొన్కల్ గ్రామల మీదగా కమలకొట్ గ్రామానికి వచ్చిన ఆర్టీసీ బస్సు తిరుగు ప్రయాణంలో ఆదర్శనగర్ గ్రామ సమీపంలో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో కమలకొట్ […]

Update: 2021-12-18 00:18 GMT

దిశ, నిర్మల్ రూరల్: అదుపుతప్పి పంట పొలాల్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన సంఘటన నిర్మల్ జిల్లా మామడ మండలంలో చోటు చేసుకొంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ నుండి మామడ, ఫొన్కల్ గ్రామల మీదగా కమలకొట్ గ్రామానికి వచ్చిన ఆర్టీసీ బస్సు తిరుగు ప్రయాణంలో ఆదర్శనగర్ గ్రామ సమీపంలో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో కమలకొట్ గ్రామానికి చెందిన 40 మంది విద్యార్థులు ఫొన్కల్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News