బ్లైండ్ స్కూల్‌ కు భారీగా ఆర్థికసాయం

దిశ, అంబర్ పేట్: నల్లగొండ అంధుల పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి ఆర్ధిక సహాయం చేశారు. ఇందుకు సంబంధించి గెయిల్, సీఎస్ఆర్ సంస్థలు ఎంఓయూపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు పి. చొక్కారావు, బాలాజీ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఆధారిత డెవలెప్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ (డ్వాబ్)కి రూ. 15 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనుందని ఆయన తెలిపారు. తరగతి గదుల నిర్మాణం మార్చి 31, 2022 నాటికి పూర్తి చేయనున్నట్లు వారు […]

Update: 2021-11-09 08:55 GMT

దిశ, అంబర్ పేట్: నల్లగొండ అంధుల పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి ఆర్ధిక సహాయం చేశారు. ఇందుకు సంబంధించి గెయిల్, సీఎస్ఆర్ సంస్థలు ఎంఓయూపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు పి. చొక్కారావు, బాలాజీ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఆధారిత డెవలెప్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ (డ్వాబ్)కి రూ. 15 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనుందని ఆయన తెలిపారు. తరగతి గదుల నిర్మాణం మార్చి 31, 2022 నాటికి పూర్తి చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 24 బ్యాచ్‌లు నూరుశాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపారు.

Tags:    

Similar News