డేంజర్ బెల్స్ మోగిస్తు్న్న ‘రాయల చెరువు’.. ప్రమాదంలో వంద గ్రామాలు

దిశ, వెబ్‌‌డెస్క్ : ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు చిత్తూరు జిల్లాలోని రాయల చెరువు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రామచంద్రాపురంలో రాయల చెరువు కుంగినట్టు తెలుస్తోంది. చెరువు కట్ట నుంచి స్వల్పంగా వరద నీరు లీకవుతున్నట్టు స్థానికులు గుర్తించి అధికారులకు తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు దిగువ గ్రామాలను అప్రమత్తం చేశారు. రాయల చెరువును ఆనుకుని ఉన్న రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరు ప్రజలను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు. అక్కడి […]

Update: 2021-11-21 04:40 GMT

దిశ, వెబ్‌‌డెస్క్ : ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు చిత్తూరు జిల్లాలోని రాయల చెరువు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రామచంద్రాపురంలో రాయల చెరువు కుంగినట్టు తెలుస్తోంది. చెరువు కట్ట నుంచి స్వల్పంగా వరద నీరు లీకవుతున్నట్టు స్థానికులు గుర్తించి అధికారులకు తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు దిగువ గ్రామాలను అప్రమత్తం చేశారు.

రాయల చెరువును ఆనుకుని ఉన్న రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరు ప్రజలను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు. అక్కడి పరిస్థితిని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ ఈ చెరువు కట్ట తెగితే సుమారు వంద గ్రామాలు నీట మునిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా? : పవన్ కల్యాణ్

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News