‘రాయల్‌‘ విక్టరీ.. పడిక్కల్ మెరుపు సెంచరీ

దిశ, వెబ్‌డెస్క్: ముంబై వాంఖడే వేదికగా రాజస్థాన్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ చేజింగ్‌లో మెరుపులు మెరిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, పడిక్కల్ దూకుడుగా ఆడుతూ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఆడుతున్నాడు. ఆర్‌సీబీ కేవలం 17 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 181 పరుగులు సాధించి ఘన విజయం సొంతం చేసుకుంది. పడిక్కల్(101) అద్భుతమైన సెంచరీతో ప్రత్యర్థులకు […]

Update: 2021-04-22 12:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముంబై వాంఖడే వేదికగా రాజస్థాన్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ చేజింగ్‌లో మెరుపులు మెరిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, పడిక్కల్ దూకుడుగా ఆడుతూ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఆడుతున్నాడు. ఆర్‌సీబీ కేవలం 17 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 181 పరుగులు సాధించి ఘన విజయం సొంతం చేసుకుంది. పడిక్కల్(101) అద్భుతమైన సెంచరీతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. పడిక్కల్‌కు తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ(72) రాణించాడు. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ పది వికెట్ల తేడాతో 181 పరుగులు చేసి విజయఢంకా మోగించింది.

కాగా, ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో శివమ్‌ దూబే(46) రియన్‌, పరాగ్‌(25)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 109 పరుగుల వద్ద పరాగ్‌ ఔటైన తర్వాత క్రీజులో వచ్చిన రాహుల్‌ తెవాటియా(40) రాణించాడు. దీంతో రాజస్తాన్‌ స్కోరు 170/9 చేయగలిగింది.

Tags:    

Similar News