అరుదైన రికార్డుకు చేరువలో రూట్.. అదేంటంటే ?

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి జో రూట్ 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఏడాది 13 మ్యాచ్‌లు ఆడిన రూట్ 1541 పరుగులు చేశాడు. దీంతో అతను ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఇంగ్లాండ్‌ తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌ను అధిగమించాడు. ఇక ఓవరాల్ […]

Update: 2021-12-10 05:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి జో రూట్ 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఏడాది 13 మ్యాచ్‌లు ఆడిన రూట్ 1541 పరుగులు చేశాడు. దీంతో అతను ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఇంగ్లాండ్‌ తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌ను అధిగమించాడు.

ఇక ఓవరాల్ రికార్డ్ చూస్తే 2010లో టెండూల్కర్ 1562 పరుగులు చేయగా, 1979లో గవాస్కర్ 1555 పరుగులు చేశాడు. ఇక 2005లో పాంటింగ్ 1544 పరుగులను చేయగా అతని రికార్డ్‌ను అధిగమించేందుకు రూట్‌ కేవలం మూడు పరుగుల దూరంలోనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం అతని ఫామ్ చూస్తే సచిన్ రికార్డ్‌ను కూడా సులువుగా బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు.

Tags:    

Similar News