ఉప్పల్‌లో లారీ బీభత్సం

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో లారీ బీభత్సం సృష్టించింది. జెన్‌ప్యాక్ హనుమాన్ టెంపుల్ వద్ద శుక్రవారం ఉదయం డీసీఎం వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. దీంతో డీసీఎం హనుమాన్ టెంపుల్ ప్రహారి గోడతో పాటు బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో మినీ గూడ్స్ వాహనాన్ని తాకడంతో.. ఆ వాహనంలోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు […]

Update: 2020-12-31 22:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో లారీ బీభత్సం సృష్టించింది. జెన్‌ప్యాక్ హనుమాన్ టెంపుల్ వద్ద శుక్రవారం ఉదయం డీసీఎం వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. దీంతో డీసీఎం హనుమాన్ టెంపుల్ ప్రహారి గోడతో పాటు బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో మినీ గూడ్స్ వాహనాన్ని తాకడంతో.. ఆ వాహనంలోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News