ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

దిశ, నల్లగొండ: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. బుధవారం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా ధాన్యం విక్రయించే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ధాన్యం ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు వెళ్లేలా చొరవ చూపాలన్నారు. మిల్లర్లు ఎవరైనా రైతులను ఇబ్బందులకు […]

Update: 2020-05-06 11:08 GMT

దిశ, నల్లగొండ: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. బుధవారం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా ధాన్యం విక్రయించే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ధాన్యం ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు వెళ్లేలా చొరవ చూపాలన్నారు. మిల్లర్లు ఎవరైనా రైతులను ఇబ్బందులకు గురిచేస్తే వారిపై కఠిన చర్యలుంటాయని ఆమె హెచ్చరించారు.

Tags: rice purchasing, speed up, collector anitha orders, review with officers

Tags:    

Similar News