వియత్నాంలో పేదల ఆకలి తీరుస్తున్న ‘రైస్ ఏటీఎం’

దిశ వెబ్ డెస్క్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ ప్రజలందరికీ కునుకు లేకుండా చేస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. దినసరి కూలీలు, పేదలు, అనాథల పరిస్థితి మన దేశంలోనే కాదు.. లాక్ డౌన్ అమలు అవుతున్న చాలా దేశాల్లో వారి పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉంది. ఈ జాబితాలో వియత్నాంలో కూడా ఉంది. వాళ్లు పడుతున్న ఇబ్బందులను, ఆకలి బాధలను చూసిన వియత్నం ప్రజలు … ‘రైస్ […]

Update: 2020-04-15 03:22 GMT

దిశ వెబ్ డెస్క్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ ప్రజలందరికీ కునుకు లేకుండా చేస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. దినసరి కూలీలు, పేదలు, అనాథల పరిస్థితి మన దేశంలోనే కాదు.. లాక్ డౌన్ అమలు అవుతున్న చాలా దేశాల్లో వారి పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉంది. ఈ జాబితాలో వియత్నాంలో కూడా ఉంది. వాళ్లు పడుతున్న ఇబ్బందులను, ఆకలి బాధలను చూసిన వియత్నం ప్రజలు … ‘రైస్ ఏటీఎం’అనే వినూత్న ఆలోచనతో పరిష్కారం చూపారు. లాక్ డౌన్ కారణంగా.. ఎంతోమంది ఉపాధి లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే అలాంటి వాళ్ల ఆకలి తీర్చేందుకు హోచి మిన్ సిటీకి చెందిన హోంగ్ టున్ అన్ అనే వ్యాపారి కొత్త ప్రయత్నంతో ముందుకొచ్చారు. నగరంలో ఉచితంగా బియ్యం పంచేందుకు ‘రైస్ ఏటీఎం’లను ఏర్పాటు చేయించారు. ఏటీఎం నుంచి ఒక వ్యక్తి 1.5 కిలోల బియ్యం తీసుకోవచ్చు. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. వియత్నాంలోని హనోయి, హూ, డనాంగ్ అనే నగరాల్లోనూ ఇలాంటి రైస్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.

అక్కడ కూడా :

హనోయి సిటీలో ఓ పెద్ద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. ఆ ట్యాంకు నుంచి ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బియ్యం తీసుకోవచ్చు. బియ్యం తీసుకోవడానికి వచ్చిన వ్యక్తులు ఒకరికొకరు కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలి. అంతేకాదు ప్రతి వ్యక్తి బియ్యం తీసుకునే ముందు శానిటైజర్ తో చేతులు కడుక్కోవాలి. హు నగరంలో ఏర్పాటు చేసిన ఏటీఎం లో ప్రతి వ్యక్తి 2 కిలోల రైస్ ను ఉచితంగా తీసుకోవచ్చు. డనాంగ్ సిటీలో రెండు ఏటీఎంలు ఏర్పాటు చేశారు. వియత్నాంలోని మరిన్ని ప్రాంతాల్లో రైస్ ఏటీఎం లను ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు.

ఒక్క కరోనా మరణం లేదు :

వియత్నాం.. చైనాకు ఆనుకుని ఉన్న దాని మిత్ర దేశం. చైనాలోనే కరోనా అలా విజృంభిస్తుంటే… వియత్నాం.. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కదా..! కానీ.. ఈ దేశం కరోనా కోరలకు చిక్కలేదు. ముందే అప్రమత్తమై తన ప్రజలను రక్షించుకుంది. వియత్నాంలో ఇప్పటివరకూ 88 వేల మందికి కరోనా పరీక్షలు చేస్తే 265 మందికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. వారిలో 128 మంది కోలుకున్నారు కూడా. ఒక్క మరణం సంభవించలేదు. గణాంకాలు ఆశ్చర్య పరుస్తున్నా ఇది వాస్తవం..! ఇది కరోనాపై వియత్నాం సాధించిన విజయం. కరోనా మహమ్మారి అంతగా లేకపోయినా… వియత్నాం ప్రభుత్వం ముందుగా మేల్కొని తమ ప్రజలను రక్షించుకునేందుకు లాక్ డౌన్ విధించింది. దాంతో వ్యవస్థ అంతా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఆ కారణంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఎంతోమంది తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాళ్ల కోసం ‘రైస్ ఏటీఎం’తో ఆలోచనతో ముందుకు వచ్చారు.

చిత్రాలతో ప్రచారం :

కరోనా వైర్‌స్ ను కట్టడి చేసేందుకు లె డక్‌ హిప్‌ అనే ఆర్టిస్టు రూపొందించిన పోస్టర్‌ ఎనలేని ప్రచారాన్ని కల్పించింది. ఆరోగ్య కార్యకర్తతో చేయి కలిపి నినదిస్తున్న వ్యక్తి చిత్రంతో గీసిన బొమ్మ సాధారణ ప్రజానీకాన్ని ఆకట్టుకుంది. హ్యాండ్‌ వాష్‌పై అవగాహనకు రూపొందించిన పాటలు కూడా మేలు చేశాయి. మాస్కు ధరించిన ఆరోగ్య కార్యకర్త ప్రధాన కూడళ్లలో నిలబడి ‘ఇంట్లో ఉండడమే నిజమైన దేశభక్తి’ అని ప్రచారం చేయడం కూడా ప్రజల్లో అవగాహన తీసుకువచ్చింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారికి, సోషల్‌మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేసిన వారికి జరిమానాలు విధించింది. మాస్కులు ధరించకుండా తిరిగే వారికి జైలుశిక్ష కూడా విధించింది.

Tags : corona virus, vietnam, rice atm, poor people, food, hungry

Tags:    

Similar News