హుజురాబాద్ ఎఫెక్ట్.. రిజైన్ చేయాలంటూ TRS ఎమ్మెల్యేపై ట్రోల్స్

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ బై పోల్స్‌లో సవాళ్లపై సవాళ్లు విసురుకున్న నేతలకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఉచ్చు బిగిస్తున్నారు. ఇక్కడ ఈటల గెలిస్తే తాను రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్ వేదికగా గువ్వల విసిరిన ఈ ఛాలెంజ్‌ను ఆయన స్వీకరించాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం, గువ్వల రాజీనామా చెయ్ అంటూ సెటైర్లు […]

Update: 2021-11-02 10:38 GMT

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ బై పోల్స్‌లో సవాళ్లపై సవాళ్లు విసురుకున్న నేతలకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఉచ్చు బిగిస్తున్నారు. ఇక్కడ ఈటల గెలిస్తే తాను రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్ వేదికగా గువ్వల విసిరిన ఈ ఛాలెంజ్‌ను ఆయన స్వీకరించాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం, గువ్వల రాజీనామా చెయ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

 

Tags:    

Similar News