హెలికాప్టర్‌తో రెస్క్యూ ఆపరేపన్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాతబస్తీలోని పలు ప్రాంతాలు జగదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో వారిని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ సిద్ధం చేయించింది. కాసేపట్లో పాతబస్తీలోని చాంద్రాయణ గుట్టలో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టనున్నారు. వరదనీటిలో చిక్కుకున్న ఫలక్ నుమాలో రక్షణ చర్యలు చేపట్టేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతోంది. నీటిలో చిక్కుకున్న బాధితులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు.

Update: 2020-10-14 00:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాతబస్తీలోని పలు ప్రాంతాలు జగదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో వారిని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ సిద్ధం చేయించింది. కాసేపట్లో పాతబస్తీలోని చాంద్రాయణ గుట్టలో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టనున్నారు.

వరదనీటిలో చిక్కుకున్న ఫలక్ నుమాలో రక్షణ చర్యలు చేపట్టేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతోంది. నీటిలో చిక్కుకున్న బాధితులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు.

Tags:    

Similar News