ఆయన వేతనం నుంచి రికవరీ చేయండి: కలెక్టర్ శరత్

దిశ, కామారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ వేతనం నుంచి ఆసరా పింఛన్ల డబ్బులు రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.శరత్ ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల 33 మంది ఆసరా పింఛన్లు రద్దు అయినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహించిన కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. మూడు మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ […]

Update: 2021-01-15 05:19 GMT

దిశ, కామారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ వేతనం నుంచి ఆసరా పింఛన్ల డబ్బులు రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.శరత్ ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల 33 మంది ఆసరా పింఛన్లు రద్దు అయినట్లు గుర్తించామన్నారు.

ఈ ఘటనకు బాధ్యత వహించిన కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. మూడు మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ కోసం స్థలాన్ని ఎంపిక చేయాలని కమిషనర్లను ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎల్లారెడ్డిలో అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను పూర్తిచేయాలని కోరారు. పల్లె ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్‌లను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.

Tags:    

Similar News