అరుదైన రికార్డ్.. ఒకే ఇంటి నుంచి ఐదుగురు కలెక్టర్లు
దిశ, వెబ్‌డెస్క్: అనగనగా ఓ రైతు కుటుంబం.. ఆయనకు ఐదుగురు ఆడపిల్లలే.. అయ్యో నాకు అందరు ఆడపిల్లలే పుట్టారని కుంగిపోలేదు ఆ రైతు.. ఐదుగురు పిల్లలను చదివించాడు. కూతుర్లనే కొడుకులుగా పెంచాడు. జీవితంలో తాను సాధించలేని ఘనతను తన పిల్లల ద్వారా సాధించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు ఆడపిల్లలను కలెక్టర్లను చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తండ్రి కోరికను నిజంచేసి ఆ ఐదుగురు అక్కాచెల్లెళ్లు రికార్డు సాధించారు. ఈ అరుదైన ఘటన రాజస్థాన్ లో […]
దిశ, వెబ్‌డెస్క్: అనగనగా ఓ రైతు కుటుంబం.. ఆయనకు ఐదుగురు ఆడపిల్లలే.. అయ్యో నాకు అందరు ఆడపిల్లలే పుట్టారని కుంగిపోలేదు ఆ రైతు.. ఐదుగురు పిల్లలను చదివించాడు. కూతుర్లనే కొడుకులుగా పెంచాడు. జీవితంలో తాను సాధించలేని ఘనతను తన పిల్లల ద్వారా సాధించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు ఆడపిల్లలను కలెక్టర్లను చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తండ్రి కోరికను నిజంచేసి ఆ ఐదుగురు అక్కాచెల్లెళ్లు రికార్డు సాధించారు. ఈ అరుదైన ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే రాజస్థాన్ లో నివాసముండే శ్రీ సహదేవ్ సహరన్ కి రోమా, మంజు, అన్షు రీతు, సుమన్ అనే ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. చిన్నతనం నుంచి వారిని కూతుర్లు లా కాకుండా కొడుకులుగా పెంచాడు. మధ్యతరగతి కుటుంబమే అయినా ఏనాడూ సహారా కుంగిపోలేదు. కష్టపడి ఐదుగురు పిల్లలను చదివించాడు. అయితే తనకు కలెక్టర్ కావాలన్న కోరిక ఉండగా.. ఆ విషయాన్ని తన కుమార్తెలకు చెప్పారు. తన కోరిక నెరవేర్చాలంటూ తన మనసులోని మాట బయటపెట్టారు. దీంతో తండ్రిని అర్థం చేసుకున్న తనయలు.. రోమా, మంజు ఎంతో కష్టపడి చదివి కలెక్టర్లు అయ్యారు.
All five daughters of Farmer Sahdev Saharan are now RAS officers. Ritu, Anshu and Suman are selected yesterday. Other two were already in service. What a proud moment for family and village. pic.twitter.com/MPwCdkgO8E
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 15, 2021
ఇక మిగిలిన ముగ్గురు కూడా ఐఏఎస్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2018 లో నిర్వహించిన రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష ఫలితాలు మంగళవారం ప్రకటించగా… అన్షు, రీతు, సుమన్ లకు రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఆర్‌ఎఎస్)కు ఏకకాలంలో ఎంపికై ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక ఒకే ఇంట్లో ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఐఏఎస్ లు కావడంతో ప్రస్తుతం ఆ యువతులు అందర్నీ ఆకర్షిస్తున్నారు. ఆర్‌ఎఎస్‌కు ఎంపికైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఫోటోలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కష్వాన్ షేర్ చేయడంతో అందరికీ ఈ విషయం తెలిసింది. వారిని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది..