అరుదైన సంఘటన: మేక పిల్లకు పాలు ఇచ్చిన కుక్క

దిశ, దుబ్బాక: సృష్టిలో తల్లి ప్రేమను మించిన దైవం లేదంటారు. అంద వికారంగా ఉన్నా.. అవయవ లోపం ఉన్నా తల్లి మాత్రం తన పిల్లలను ప్రాణంతో సమానంగా చూస్తుంది. అది మనుషుల్లో నైనా, జంతువుల్లో నైనా ప్రేమలో మాత్రం తేడా ఉండదు. కానీ జాతి వైరాన్ని మరచి ఓ శునకం మేక పిల్లకు పాలు ఇచ్చి తన మాతృత్వాన్ని చాటుకుంది. ఈ అరుదైన సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన […]

Update: 2021-09-14 10:02 GMT

దిశ, దుబ్బాక: సృష్టిలో తల్లి ప్రేమను మించిన దైవం లేదంటారు. అంద వికారంగా ఉన్నా.. అవయవ లోపం ఉన్నా తల్లి మాత్రం తన పిల్లలను ప్రాణంతో సమానంగా చూస్తుంది. అది మనుషుల్లో నైనా, జంతువుల్లో నైనా ప్రేమలో మాత్రం తేడా ఉండదు. కానీ జాతి వైరాన్ని మరచి ఓ శునకం మేక పిల్లకు పాలు ఇచ్చి తన మాతృత్వాన్ని చాటుకుంది.

ఈ అరుదైన సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూమయ్య అనే మేకలకాపరికి చెందిన మేక పిల్లకు తన దగ్గర పెంచుకున్న శునకం ఉదయం పాలిస్తూ కనిపించింది. అటుగా వెళ్తున్న వారు సెల్ ఫోన్ లో ఈ వింతను చిత్రీకరించారు. ఇలా జాతి వైరాన్ని మరచి మేక పిల్లకు శునకం పాలివ్వడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News