రాఖీ పండుగ శుభాకాంక్షలు: మంత్రి సబిత

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: అన్న చెల్లెళ్ళ, అక్క తమ్ముళ్ల అపురూప అనుబంధానికి ప్రతీక రక్ష బంధన్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తనకు రక్షణగా ఉండాలని, ఆప్యాయతతో ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కడుతారని తెలిపారు. అందుకు ప్రతిగా సోదరి క్షేమం కోరుతూ అండగా ఉండటమే రక్ష బంధన్ అర్థం అని ఆమె వివరించారు. అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముల చేతికి కట్టే పవిత్ర బంధనం రాఖీ, ప్రేమానురాగాలను, ఒకరి పట్ల ఒకరి […]

Update: 2020-08-02 23:44 GMT

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: అన్న చెల్లెళ్ళ, అక్క తమ్ముళ్ల అపురూప అనుబంధానికి ప్రతీక రక్ష బంధన్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తనకు రక్షణగా ఉండాలని, ఆప్యాయతతో ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కడుతారని తెలిపారు.

అందుకు ప్రతిగా సోదరి క్షేమం కోరుతూ అండగా ఉండటమే రక్ష బంధన్ అర్థం అని ఆమె వివరించారు. అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముల చేతికి కట్టే పవిత్ర బంధనం రాఖీ, ప్రేమానురాగాలను, ఒకరి పట్ల ఒకరి భాధ్యతను, రక్షణను గుర్తు చేసే పవిత్ర దారమని అభివర్ణించారు. రాఖీ పౌర్ణమిని అందరూ ఆనందోత్సవాల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆమె రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News