కంటతడి పెడుతున్న కమలాయిపల్లి రైతులు

దిశ, హుస్నాబాద్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మద్దూర్ మండలం కమలాయిపల్లిలో పంటపొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ అప్పులు చేసి వరినాట్లు, పత్తి పంట వేస్తే భారీ వర్షాలతో పంటలు చేతికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమలాయిపల్లిలో చెరువులు, కుంటలు అలుగులు దుంకడంతో దాదాపుగా 30 ఎకరాల పంటనష్టం వాటిల్లిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించి మా కుటుంబాలను ఆదుకోవాలని రైతులు […]

Update: 2020-08-02 22:01 GMT

దిశ, హుస్నాబాద్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మద్దూర్ మండలం కమలాయిపల్లిలో పంటపొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ అప్పులు చేసి వరినాట్లు, పత్తి పంట వేస్తే భారీ వర్షాలతో పంటలు చేతికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కమలాయిపల్లిలో చెరువులు, కుంటలు అలుగులు దుంకడంతో దాదాపుగా 30 ఎకరాల పంటనష్టం వాటిల్లిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించి మా కుటుంబాలను ఆదుకోవాలని రైతులు కాళీ బాలమల్లు, కాళీ అంజయ్య, చంద్రం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Tags:    

Similar News