వెదర్ రిపోర్ట్: ఆ జిల్లాలకు వర్ష సూచన

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉత్తర తమిళనాడు మధ్య ఉపరితల ద్రోణి బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. అయితే కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు మరో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఎల్లుండి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అటు తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. హైదరాబాద్‌లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి. వడగాల్పులతో పాటు ఉక్కబోతతో ప్రజలు […]

Update: 2021-04-06 21:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉత్తర తమిళనాడు మధ్య ఉపరితల ద్రోణి బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. అయితే కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు మరో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఎల్లుండి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.

అటు తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. హైదరాబాద్‌లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి. వడగాల్పులతో పాటు ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు.

Similar News