శివసేనా రెడ్డిని పరామర్శించిన రాహుల్ గాంధీ

దిశ, తెలంగాణ బ్యూరో: పెరిగిన ఇందన ధరలు, పెగాసెస్ స్పైవేర్, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 5న ఢిల్లీలో నిర్వహించిన పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు జరిగిన తోపులాటలో తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి కాలు విరిగింది. శనివారం జరిగిన మీటింగ్ లో శివసేనా రెడ్డి సిమెంట్ పట్టీతో హాజరవగా అది చూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను జాతీయ […]

Update: 2021-08-07 10:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పెరిగిన ఇందన ధరలు, పెగాసెస్ స్పైవేర్, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 5న ఢిల్లీలో నిర్వహించిన పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు జరిగిన తోపులాటలో తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి కాలు విరిగింది. శనివారం జరిగిన మీటింగ్ లో శివసేనా రెడ్డి సిమెంట్ పట్టీతో హాజరవగా అది చూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణ అల్లవారుని రాహుల్ అడిగి తెలుసుకన్నారు. పోలీసుల తీరుపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని శివసేన కి రాహుల్ మాట ఇచ్చారు. అంతేకాకుండా చికిత్సకయ్యే పూర్తి బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News