Team INDIA : చాంపియన్లలా ఆడారు : Rahul Dravid

దిశ, స్పోర్ట్స్: కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీపక్ చాహర్ బంతితోనే కాకుండా బ్యాటుతో కూడా మ్యాజిక్ చేసి ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించాడు. భారత జట్టు రెండో వన్డేలో చాంపియన్లలా ఆడారని.. ఓటమి పాలైనా ఆటతీరును తప్పకుండా మెచ్చుకునే వాడినని కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను గెలిచిన టీమ్ ఇండియాను ఉద్దేశించి ద్రవిడ్ […]

Update: 2021-07-21 07:40 GMT

దిశ, స్పోర్ట్స్: కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీపక్ చాహర్ బంతితోనే కాకుండా బ్యాటుతో కూడా మ్యాజిక్ చేసి ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించాడు. భారత జట్టు రెండో వన్డేలో చాంపియన్లలా ఆడారని.. ఓటమి పాలైనా ఆటతీరును తప్పకుండా మెచ్చుకునే వాడినని కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను గెలిచిన టీమ్ ఇండియాను ఉద్దేశించి ద్రవిడ్ డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడారు.

‘తొలి వన్డేలో ఓటమి తర్వాత శ్రీలంక కచ్చితంగా స్పందిస్తుందని తెలుసు. కానీ మనం సరైన ఫలితాన్ని సాధించాం. అందరూ అద్భుతంగా ఆడారు. మనం ఓడిపోయినా మీ పోరాటం గొప్పదని అంటాను. మీ అందరికీ అభినందనలు. వారిది కూడా అంతర్జాతీయ జట్టే. ఓటమికి బలంగా స్పందించారు. కానీ మనం విజేతల్లా జవాబిచ్చాం. ఇక్కడ నేను వ్యక్తిగత ప్రదర్శనల గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. ప్రతీ ఒక్కరు జట్టుగా మంచిగా ఆడారు. మొత్తం జట్టు ప్రదర్శన బాగుంది.’ అని రాహుల్ ద్రవిడ్ క్రికెటర్లను ప్రశంసించారు.

Rahul Dravid gives impeccable speech in dressing room after India’s win in 2nd ODI, BCCI shares video

Tags:    

Similar News