యంగ్ ఏజ్‌లో ఐబ్రోస్ లేకుంటే.. అబ్బాయిల అటెన్సన్ ఉండదన్నారు: రాధికా
దిశ, సినిమా: మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే.. ఇతరులు మనల్ని ప్రేమిస్తారని నమ్ముతానని తెలిపింది హీరోయిన్ రాధికా మదన్. అందుకే చిన్నప్పటి నుంచి తనలో ఉన్న లోపాలను కూడా ప్రేమించగలిగానని తెలిపింది. చైల్డ్‌హుడ్‌లో కొంటెపిల్ల అయిన తను ‘రాణి’ మాదిరి ఫీల్ అయ్యేదాన్నని చెప్పింది. యంగ్ ఏజ్‌లో తనకు ఐబ్రోస్ సరిగ్గాలేవని, అబ్బాయిల అటెన్షన్ ఉండదని కొంత మంది చెప్పినా.. తాను పట్టించుకోలేదని, అందంగా ఉన్నాననే కాన్ఫిడెన్స్‌తోనే ముందుకుసాగానని తెలిపింది. ‘పెద్దయ్యాక ఏమవుతావు?’ అని ఎవరైనా అడిగితే ‘పెళ్లి […]
దిశ, సినిమా: మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే.. ఇతరులు మనల్ని ప్రేమిస్తారని నమ్ముతానని తెలిపింది హీరోయిన్ రాధికా మదన్. అందుకే చిన్నప్పటి నుంచి తనలో ఉన్న లోపాలను కూడా ప్రేమించగలిగానని తెలిపింది. చైల్డ్‌హుడ్‌లో కొంటెపిల్ల అయిన తను ‘రాణి’ మాదిరి ఫీల్ అయ్యేదాన్నని చెప్పింది. యంగ్ ఏజ్‌లో తనకు ఐబ్రోస్ సరిగ్గాలేవని, అబ్బాయిల అటెన్షన్ ఉండదని కొంత మంది చెప్పినా.. తాను పట్టించుకోలేదని, అందంగా ఉన్నాననే కాన్ఫిడెన్స్‌తోనే ముందుకుసాగానని తెలిపింది. ‘పెద్దయ్యాక ఏమవుతావు?’ అని ఎవరైనా అడిగితే ‘పెళ్లి చేసుకుంటాను’ అని సమాధానమిచ్చేదాన్ని అంది.
అయితే అనుకోకుండా తనకు డ్యాన్స్‌పై ఇంట్రెస్ట్ పెరగడంతో తల్లిదండ్రులు సపోర్ట్ చేశారని, 17 ఏళ్ల వయసులో ముంబైలో ఓ టీవీ షో కోసం ఆడిషన్ చేయగా.. అక్కడే మూడు రోజులు ఉండాల్సి వచ్చిందని తెలిపింది. అయితే షూటింగ్ చాలా కఠినంగా అనిపించిందని.. నిద్రపోయేందుకు టైమ్ కూడా ఉండేది కాదని చెప్పింది. ఇక సెలెక్ట్ అయ్యాక బరువు పెరగడంతో తన స్థానంలో మరొకరిని తీసుకుంటారనే రూమర్స్‌తో వర్కౌట్ ప్రారంభించానని.. అప్పటికే ఆ పాత్ర చేజారిందని తెలుసుకున్నట్లు చెప్పింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత టీవీ ఆఫర్లు వచ్చినా.. తనకు అప్పుడు 19 ఏళ్లు మాత్రమే కాబట్టి సినిమాల్లో ట్రై చేస్తేనే బెటర్ అని ఆ ఆఫర్స్‌కు నో చెప్పినట్లు తెలిపింది రాధిక.
ఇక మూవీ ఆడిషన్స్‌కు అటెండ్ అయిన తనకు పర్టిక్యులర్ షేప్, సైజ్ ఉండాలని.. సర్జరీ చేయించుకుంటే బెటర్ అని సజెషన్స్ ఇచ్చారని చెప్పింది. కానీ తనకు తాను అందంగా కనిపించినప్పుడు బాగా లేనని చెప్పేందుకు వారెవరనే ఉద్దేశంతో.. అలాగే ఏడాదిన్నర పాటు ఆడిషన్స్‌కు అటెండ్ అయ్యాక ఫస్ట్ ప్రాజెక్ట్‌కు సైన్ చేయగలిగానని తెలిపింది. ఆ క్యారెక్టర్‌కు తగినట్లు ఓల్డ్‌గా కనిపించేందుకు 12 కిలోల వెయిట్ గెయిన్ చేశానని.. ఆ తర్వాత నెలలోనే 17 ఏళ్ల అమ్మాయి పాత్ర కోసం ఆడిషన్ చేశానని వివరించింది. అంటే మనలో ఉన్న లోపాలను కూడా సెలబ్రేట్ చేసుకున్నప్పుడే.. ఇంపర్ఫెక్షన్‌లోనూ పర్‌ఫెక్ట్‌గా కనిపిస్తామని, సక్సెస్‌ను చూస్తామని వివరించింది రాధిక.