ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: ఆర్.క్రిష్ణయ్య
దిశ, ముషీరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య అన్నారు. ఉద్యోగ పదవీ విరమణ వయస్సు పెంచుతామన్న సీఎం కేసీఆర్ ప్రకటనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ముఖ్య […]
దిశ, ముషీరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య అన్నారు. ఉద్యోగ పదవీ విరమణ వయస్సు పెంచుతామన్న సీఎం కేసీఆర్ ప్రకటనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.క్రిష్ణయ్య మాట్లాడుతూ…. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ వయస్సు పెంచడంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్నారు. సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వకపోవడం సిగ్గు చేటన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు డిగ్రీ పట్టాలు చేత పట్టుకొని రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.