కేంద్రానికి వ్యవసాయం గురించి తెలియదు !

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయం గురించి తెలియదని, అందుకే నిరసనలను అర్థం చేసుకోవడం లేదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్న రైతులకు అండగా ఆయన ఇవాళ ధర్నాలో కూర్చున్నారు. అగ్రి బిల్లుల అంశంలో తమ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని స్పష్టం చేశారు. గత మూడేళ్లలో పంజాబ్‌లో 150మంది ఉగ్రవాదులను అణిచివేశామని, ఇఫ్పుడు రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉందన్నారు. ప్రస్తుతం నిరసన చేస్తున్న రైతులంతా పాకిస్థాన్‌ ఐఎస్ఐకు టార్గెట్‌గా మారే […]

Update: 2020-09-28 04:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయం గురించి తెలియదని, అందుకే నిరసనలను అర్థం చేసుకోవడం లేదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్న రైతులకు అండగా ఆయన ఇవాళ ధర్నాలో కూర్చున్నారు. అగ్రి బిల్లుల అంశంలో తమ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని స్పష్టం చేశారు. గత మూడేళ్లలో పంజాబ్‌లో 150మంది ఉగ్రవాదులను అణిచివేశామని, ఇఫ్పుడు రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉందన్నారు. ప్రస్తుతం నిరసన చేస్తున్న రైతులంతా పాకిస్థాన్‌ ఐఎస్ఐకు టార్గెట్‌గా మారే అవకాశం ఉందని ఆరోపించారు.

Tags:    

Similar News