కరోనా వారియర్స్ సంక్షేమం మన బాధ్యత : పూజా హెగ్డే

పూజా హెగ్డే… వరుస హిట్లతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. గ్లామరస్ రోల్ అయినా సరే.. నటనా ప్రాధాన్యమున్న పాత్రలైనా సరే.. ఆమెకే మొగ్గుచూపుతున్నారు డైరెక్టర్లు, హీరోలు. తాజాగా అల వైకుంఠపురంలో హిట్ అందుకున్న భామ… బాహుబలి ప్రభాస్ కు జోడిగా ఓ డియర్ మూవీ చేస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా… పీరియాడిక్ రొమాంటిక్ మూవీగా రూపుదిద్దుకుంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందన్న […]

Update: 2020-05-08 06:29 GMT

పూజా హెగ్డే… వరుస హిట్లతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. గ్లామరస్ రోల్ అయినా సరే.. నటనా ప్రాధాన్యమున్న పాత్రలైనా సరే.. ఆమెకే మొగ్గుచూపుతున్నారు డైరెక్టర్లు, హీరోలు. తాజాగా అల వైకుంఠపురంలో హిట్ అందుకున్న భామ… బాహుబలి ప్రభాస్ కు జోడిగా ఓ డియర్ మూవీ చేస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా… పీరియాడిక్ రొమాంటిక్ మూవీగా రూపుదిద్దుకుంటుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందన్న విషయం తెలిసిందే. వారికి ట్రీట్మెంట్ ఇస్తే ప్రమాదం అని తెలిసినా సరే.. వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టి పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బందిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తుచేస్తోంది. ప్రస్తుతం దేశంలో PPE కిట్ల కొరత ఉందని.. కిట్స్ ధరించకుండా సేవలు అందించడం వైద్యులకు ప్రమాదమని చెప్పింది. కరోనా వారియర్స్ కు కిట్స్ అందించేందుకు మీ వంతు విరాళం అందించాలని కోరుతోంది. ఈ క్రమంలో ట్రింగ్ ( tring.co.in) అనే స్వచ్ఛంద సంస్థతో పని చేస్తున్నానన్న పూజ.. మీరు కూడా సహాయం చేయాలి అనుకుంటే ఈ సంస్థను సంప్రదించాలని కోరింది. ప్రతీ కిట్ ధర రూ. 650 ఉంటుందన్న పూజా.. చిన్న హెల్ప్ అయినా సరే చాలా ప్రభావితం చూపుతుందని గుర్తుంచుకోవాలని కోరారు. మీ సహాయాన్ని నా సోషల్ మీడియాలో వీడియో ద్వారా అనౌన్స్ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని తెలిపిన పూజా.. నా వంతు హెల్ప్ నేను చేస్తున్నా.. దయచేసి మీరూ సహాయం చేయాలని కోరింది. త్వరలో తెలంగాణ, ఏపీ లో ఉన్న హాస్పిటల్స్ పేర్లు ప్రకటిస్తామని.. మీరు ఏ హాస్పిటల్ కు కిట్స్ అందించాలి అనుకుంటే ఆ ఆస్పత్రికి కిట్స్ అందిస్తామని చెప్పింది.


Tags: Puja Hegde, CoronaVirus, Covid19, Corona, Tollywood, Telangana, andhra pradesh

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News