లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగే క్రమంలో పూజ

దిశ, వెబ్‌డెస్క్: బుట్ట బొమ్మ పూజా హెగ్డే.. అటు బాలీవుడ్ ఇటు సౌత్ ఇండస్ట్రీలో తన హవా చూపిస్తోంది. ‘గద్దల కొండ గణేష్’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలతో టాలీవుడ్‌లో సక్సెస్ అందుకున్న ఈ భామ… ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’, ‘ఓ డియర్’ మూవీస్‌తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. గ్లామరస్ టచ్‌తోనే కెరియర్‌లో పీక్స్ చూస్తున్న ఈ భామ… నెక్స్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీకి కమిట్ అయిందనే వార్తలు వస్తున్నాయి. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’, […]

Update: 2020-03-16 04:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుట్ట బొమ్మ పూజా హెగ్డే.. అటు బాలీవుడ్ ఇటు సౌత్ ఇండస్ట్రీలో తన హవా చూపిస్తోంది. ‘గద్దల కొండ గణేష్’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలతో టాలీవుడ్‌లో సక్సెస్ అందుకున్న ఈ భామ… ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’, ‘ఓ డియర్’ మూవీస్‌తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. గ్లామరస్ టచ్‌తోనే కెరియర్‌లో పీక్స్ చూస్తున్న ఈ భామ… నెక్స్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీకి కమిట్ అయిందనే వార్తలు వస్తున్నాయి. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’, ‘పడి పడి లేచే మనసు’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు హను రాఘవపూడి డైరెక్షన్‌లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. హను రాఘవపూడి కథ విన్న పూజ ఓకే చెప్పిందని ఫిల్మ్ నగర్ టాక్. డేట్లు సర్దుబాటు చేయగానే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందట.

‘అరుంధతి’, ‘భాగమతి’తో అనుష్క, ‘మహానటి’తో కీర్తి సురేశ్, ‘ఓ బేబి’, ‘జాను’తో సమంత, అంజలి సీబీఐ లాంటి చిత్రాలతో నయనతార ఇప్పటికే లేడి ఓరియంటెడ్ చిత్రాలతో ఆకట్టుకున్నారు. హీరోలకు తామేమీ తక్కువ కాదని నిరూపించారు. మరి పూజా హెగ్డే కూడా అలా ప్రూవ్ చేసుకోగలదా? లేడీ సూపర్ స్టార్ జాబితాలో చేరగలదా చూడాలి మరి.

tags : Puja Hegde, Ala Vaikuntapuramlo. Lady Oriented Movie, Hanu Raghavapudi

Tags:    

Similar News