అత్యంత క్రూరమైన చర్య : ప్రియాంక

తమిళనాడు ట్యూటికోరిన్ ఘటనలో బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేసింది యూనివర్సల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఈ ఘటన గురించి విన్నాక అత్యంత క్రూరమైన పోలీసుల చర్యకు షాక్ అయ్యానని తెలిపింది. బాధ, కోపం కట్టలు తెంచుకుందన్న ప్రియాంక.. ఎంత తప్పు చేస్తే మాత్రం పోలీసులు అంత నరకం చూపించాలా? అని ప్రశ్నించింది. జైరాజ్, ఫెనిక్స్ కుటుంబానికి న్యాయం జరగాలని.. అందుకోసం మన గొంతుకలు వినిపించాలని కోరింది. తండ్రీ కొడుకులను కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడెలా బతుకుతుందో […]

Update: 2020-06-27 00:38 GMT

తమిళనాడు ట్యూటికోరిన్ ఘటనలో బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేసింది యూనివర్సల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఈ ఘటన గురించి విన్నాక అత్యంత క్రూరమైన పోలీసుల చర్యకు షాక్ అయ్యానని తెలిపింది. బాధ, కోపం కట్టలు తెంచుకుందన్న ప్రియాంక.. ఎంత తప్పు చేస్తే మాత్రం పోలీసులు అంత నరకం చూపించాలా? అని ప్రశ్నించింది. జైరాజ్, ఫెనిక్స్ కుటుంబానికి న్యాయం జరగాలని.. అందుకోసం మన గొంతుకలు వినిపించాలని కోరింది. తండ్రీ కొడుకులను కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడెలా బతుకుతుందో ఊహించడానికి కూడా కష్టంగా ఉందని తెలిపింది. ఈ విషయంలో ఆ కుటుంబానికి అండగా నిలబడాలని కోరింది.

కాగా లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి షాప్ తెరిచి ఉంచారని జైరాజ్, ఫెనిక్స్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. మూడు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా, పోలీసుల అహంకారాన్ని ఖండిస్తూ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో నిరసన తెలుపుతున్నారు. జైరాజ్, ఫెనిక్స్‌కు జస్టిస్ జరగాలని మద్దతు తెలుపుతున్నారు.

Tags:    

Similar News