భార్యలను వేధించి జైలుకెళ్లిన ఖైదీ.. అక్కడ ఏంచేశాడంటే?

దిశ, వెబ్ డెస్క్: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఒక ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం.. చింతూరు మండలం చట్టి గ్రామానికి చెందిన కళ్యాణం వెంకన్న కు ఇద్దరు భార్యలు. పెళ్లి చేసుకున్న దగ్గరనుండి వెంకన్న భార్యలను చిత్ర హింసలకు గురిచేస్తుండేవాడు. మద్యం తాగొచ్చి వారిద్దరిని చితకబాదేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేని ఇద్దరు భార్యలు పోలీసులను ఆశ్రయించారు. తమ భర్త, తమపై అనుమానం పెంచుకొని రోజూ  చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, […]

Update: 2021-05-04 23:14 GMT

దిశ, వెబ్ డెస్క్: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఒక ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం.. చింతూరు మండలం చట్టి గ్రామానికి చెందిన కళ్యాణం వెంకన్న కు ఇద్దరు భార్యలు. పెళ్లి చేసుకున్న దగ్గరనుండి వెంకన్న భార్యలను చిత్ర హింసలకు గురిచేస్తుండేవాడు. మద్యం తాగొచ్చి వారిద్దరిని చితకబాదేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేని ఇద్దరు భార్యలు పోలీసులను ఆశ్రయించారు. తమ భర్త, తమపై అనుమానం పెంచుకొని రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతని నుండి తమను కాపాడాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకన్నను అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు కి తరలించారు. ఈ నేపథ్యంలో మనగలవారం వెనకున్న స్నానానికి వెళ్లి ఎంతసేపటికి రాకపోవడంతో సహా ఖైదీలు జైలు సూపరింటెండెంట్‌ రాజారావుకి సమాచారం అందించారు. ఆయన వెళ్లి పరిశీలించగా.. స్నానాల గదిలో వెంకన్న విగతజీవిగా పడివున్నాడు. టవల్ తో గొంతు బిగించుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News