రాఫెల్ రాకతో సంస్కృతం రాసిన మోదీ

దిశ, వెబ్‌డెస్క్: రాఫెల్ యుద్ధ విమానాలు భారత గడ్డపై అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం అంబాలా ఎయిర్ బేస్ క్యాంప్‌‌ చేరుకున్న రాఫెల్ యుద్ధ విమానాలకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని రాఫెల్ విమానాలను స్వాగతిస్తూ సంస్కృతంలో ట్వీట్ చేశారు. దేశ రక్షణ కన్నా ఏ కార్యం గొప్పది కాదన్న మోదీ.. దేశాన్ని రక్షించడమే ఓ గొప్ప వ్రతమని అభివర్ణించారు. దేశాన్ని కాపాడేందుకు మించినది ఏది లేదని.. […]

Update: 2020-07-29 08:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాఫెల్ యుద్ధ విమానాలు భారత గడ్డపై అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం అంబాలా ఎయిర్ బేస్ క్యాంప్‌‌ చేరుకున్న రాఫెల్ యుద్ధ విమానాలకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని రాఫెల్ విమానాలను స్వాగతిస్తూ సంస్కృతంలో ట్వీట్ చేశారు.

దేశ రక్షణ కన్నా ఏ కార్యం గొప్పది కాదన్న మోదీ.. దేశాన్ని రక్షించడమే ఓ గొప్ప వ్రతమని అభివర్ణించారు. దేశాన్ని కాపాడేందుకు మించినది ఏది లేదని.. ఎంతో కీర్తి ప్రతిష్టలతో రాఫెల్ యుద్ధవిమానాలు ఆకాశాన్ని ముద్దాడాలని ఆకాంక్షించారు. రాఫెల్ విమానాల రాక వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేసి ప్రధాని మోదీ.. సంస్కృతంలోనే వాటికి స్వాగతం పలికడం గమనార్హం.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News