2020 ఎన్నో పాఠాలు నేర్పింది : రాష్ట్రపతి

దిశ, వెబ్ డెస్క్: దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాధ్ కోవింద్ శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగం చేశారు. భారత్ 74వ స్వాతంత్ర్య దినోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రెసిడెంట్ చేసిన ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2020లో కరోనా మనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. కరోనా యోధులకు యావత్ దేశం రుణపడి ఉంటుందని వివరించారు. వైరస్ కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటం మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు కేంద్రం అనేక ఉద్దీపన పథకాల […]

Update: 2020-08-14 09:44 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాధ్ కోవింద్ శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగం చేశారు. భారత్ 74వ స్వాతంత్ర్య దినోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రెసిడెంట్ చేసిన ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2020లో కరోనా మనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. కరోనా యోధులకు యావత్ దేశం రుణపడి ఉంటుందని వివరించారు. వైరస్ కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటం మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు కేంద్రం అనేక ఉద్దీపన పథకాల ద్వారా ఆదుకుంటోందని గుర్తుచేశారు.

దేశంలో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని.. ఈ సమయంలో వర్క్‌ఫ్రం హోం, ఈ-లెర్నింగ్ బాగా పెరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా భారత్-చైనా సరిహద్దుల్లో వీరసైనికుల త్యాగాలు, గల్వాన్ ‌లోయ ఘటనలో అమరవీరులను దేశం గుర్తుచేసుకుంటోందని రాష్ట్రపతి తెలిపారు.

Tags:    

Similar News