ధాన్యం తరలింపునకు వాహనాలు సిద్ధం చేయండి

దిశ, ఆదిలాబాద్: రబీ సీజన్‌లో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడానికి లారీలను సిద్ధంగా ఉంచాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆదివారం పౌరసరఫరా, పోలీసు, రవాణా అధికారులు, లారీ కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2 లక్షల 41 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేయడం జరిగిందనన్నారు. ఇందుకోసం 204 వరి ధాన్యం […]

Update: 2020-04-12 08:28 GMT

దిశ, ఆదిలాబాద్: రబీ సీజన్‌లో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడానికి లారీలను సిద్ధంగా ఉంచాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆదివారం పౌరసరఫరా, పోలీసు, రవాణా అధికారులు, లారీ కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2 లక్షల 41 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేయడం జరిగిందనన్నారు. ఇందుకోసం 204 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు ట్రక్కులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో లాక్‌డౌన్ అమలులో ఉన్నందున ట్రక్కు డ్రైవర్లు, క్లీనర్‌లకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ ద్వారా పాసులు ఇప్పించడం జరుగుతుందని చెప్పారు.

tag: Additional Collector bhaskar rao, comments, Prepare vehicles, grain evacuation, Nirmal
slug: Prepare vehicles for grain evacuation

Tags:    

Similar News