రూ. 16 తీసుకుంటున్నాడని ఎమ్మెల్యేకు ఫిర్యాదు

దిశ, వికారాబాద్: ఆసరా పింఛన్లలో చిల్లరను పోస్ట్ మ్యాన్ నొక్కేస్తున్నాడు. ప్రభుత్వం ఇస్తున్న రూ.16ను లబ్ధిదారులకు ఇవ్వకుండా తమ జేబుల్లో వేసుకుంటున్నాడు. ఇదేంటి అని అడిగితే.. వచ్చే నెల పింఛన్‌ ఇవ్వకుండా నాలుగైదు నెలలు తిప్పించుకుంటున్నాడని పింఛన్ దారులు ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు,రూ. 1,000 నుంచి రూ. 2,016 రూపాయలకు పెంచారు. వికలాంగులకు 2,000 రూపాయల […]

Update: 2021-01-15 08:58 GMT

దిశ, వికారాబాద్: ఆసరా పింఛన్లలో చిల్లరను పోస్ట్ మ్యాన్ నొక్కేస్తున్నాడు. ప్రభుత్వం ఇస్తున్న రూ.16ను లబ్ధిదారులకు ఇవ్వకుండా తమ జేబుల్లో వేసుకుంటున్నాడు. ఇదేంటి అని అడిగితే.. వచ్చే నెల పింఛన్‌ ఇవ్వకుండా నాలుగైదు నెలలు తిప్పించుకుంటున్నాడని పింఛన్ దారులు ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు,రూ. 1,000 నుంచి రూ. 2,016 రూపాయలకు పెంచారు. వికలాంగులకు 2,000 రూపాయల నుంచి 3,016 రూపాయలకు పెంచారు.

వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట మండలం తి మ్మారెడ్డిపల్లి గ్రామంలో పోస్ట్ మ్యాన్ మాణిక్యం మాత్రం రూ.2 వేలు ఇస్తూ రూ.16 ఇవ్వకుండా కొట్టేస్తున్నాడు. ప్రతి నెలా ఇదే తంతు. ఇటీవల శుభోదయం కార్యక్రమంలో భా గంగా వచ్చిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎదుట లబ్ధిదారులు తమ గోడును వినిపించారు. తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో అన్ని రకాల పింఛన్లు 95 ఉన్నాయి. ప్రతినెలా పింఛన్ ఇచ్చేందుకు నవాబ్ పేట్ మండల కేంద్రంలోని పోస్ట్ మ్యాన్ వస్తుంటాడు. ట్రాన్స్ పోర్టు చార్జీలు ఎవరిస్తారు అని ప్రతి నెల పింఛన్ దారులకు చిల్లర రూ.16 రూపాయలు ఇవ్వకుండా కోత విధిస్తున్నాడు. కనీసం వృద్ధుల పట్ల కూడా కనికరం చూపకుండా చిల్లర డబ్బులు నొక్కుతున్నారు. ఈ విషయం వృద్ధులు ఎవరికి చెప్పాలో తెలియకా గ్రామానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యకు విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య స్పందిచారు. గ్రామంలో మరోసారి జరగకుండా చూడాలని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు.

Tags:    

Similar News