బై లింగ్వల్ ప్రాజెక్ట్‌లో బుట్టబొమ్మ..

దిశ, సినిమా : బ్యూటిఫుల్ పూజా హెగ్డే చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌ను ఏలేస్తున్న భామ.. కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ చిత్రంలో కథానాయికగా ఎంపికైన ఆమె.. మరో తమిళ్ ప్రాజెక్ట్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల తర్వాత మరో టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రాజెక్ట్‌కు హీరో ధనుష్ ఓకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ టాక్ […]

Update: 2021-07-25 08:16 GMT

దిశ, సినిమా : బ్యూటిఫుల్ పూజా హెగ్డే చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌ను ఏలేస్తున్న భామ.. కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ చిత్రంలో కథానాయికగా ఎంపికైన ఆమె.. మరో తమిళ్ ప్రాజెక్ట్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

శేఖర్ కమ్ముల తర్వాత మరో టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రాజెక్ట్‌కు హీరో ధనుష్ ఓకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ టాక్ కాగా.. ఈ సినిమాలోనూ పూజనే ఫైనల్ అయినట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న బైలింగువల్ మూవీకి దర్శకనిర్మాతలు తననే ప్రిఫర్ చేసినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News