నా మనసంతా అక్కడే.. విజయ్‌ను మిస్ అవుతున్నా : పూజా హెగ్డే

దిశ, సినిమా: ‘మాస్టర్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇళయ దళపతి విజయ్‌.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమాను ప్రకటించారు. #Thalapathy65గా వస్తున్న మూవీని ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ మేరకు సన్ టీవీ ఆఫీస్‌లో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్‌తో పాటు దర్శక, నిర్మాతలు హాజరుకాగా.. తను అటెండ్ కాలేకపోయినందుకు బాధపడిపోయింది హీరోయిన్ పూజా హెగ్డే. మరో సినిమా షూటింగ్‌లో బిజీగా […]

Update: 2021-03-31 01:41 GMT

దిశ, సినిమా: ‘మాస్టర్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇళయ దళపతి విజయ్‌.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమాను ప్రకటించారు. #Thalapathy65గా వస్తున్న మూవీని ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ మేరకు సన్ టీవీ ఆఫీస్‌లో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్‌తో పాటు దర్శక, నిర్మాతలు హాజరుకాగా.. తను అటెండ్ కాలేకపోయినందుకు బాధపడిపోయింది హీరోయిన్ పూజా హెగ్డే. మరో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ముహూర్తపు పూజకు అటెండ్ కాలేకపోయానని ట్వీట్ చేసింది. కానీ తన మనసంతా అక్కడే ఉందని, టీమ్‌తో జాయిన్ అయ్యేందుకు వెయిట్ చేయలేకపోతున్నానని తెలిపింది.

https://twitter.com/hegdepooja/status/1377137496702607366?s=20

Tags:    

Similar News