గాయపడిన మదర్ ఇండియా..

దిశ, సినిమా : మోస్ట్ పాపులర్ టెలివిజన్ యాక్ట్రెస్ పూజా బెనర్జీ మదర్స్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తనకు నలుగురు తల్లులు ఉన్నారని.. వారిని పరిచయం చేస్తూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. కన్న తల్లి పూర్ణిమ బెనర్జీని లైఫ్ గైడింగ్ ఫోర్స్‌గా అభివర్ణించిన పూజ.. అత్త రాజేష్ సెజ్వాల్ తనను సొంత కూతురిలా చూసుకుంటుందని చెప్పింది. స్కూల్ టీచర్ సుతాప ఘోషల్ చిన్ననాటి నుంచి గైడ్ చేస్తూనే ఉందని వివరించింది. అలాగే ముంబై […]

Update: 2021-05-09 07:49 GMT

దిశ, సినిమా : మోస్ట్ పాపులర్ టెలివిజన్ యాక్ట్రెస్ పూజా బెనర్జీ మదర్స్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తనకు నలుగురు తల్లులు ఉన్నారని.. వారిని పరిచయం చేస్తూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. కన్న తల్లి పూర్ణిమ బెనర్జీని లైఫ్ గైడింగ్ ఫోర్స్‌గా అభివర్ణించిన పూజ.. అత్త రాజేష్ సెజ్వాల్ తనను సొంత కూతురిలా చూసుకుంటుందని చెప్పింది.

స్కూల్ టీచర్ సుతాప ఘోషల్ చిన్ననాటి నుంచి గైడ్ చేస్తూనే ఉందని వివరించింది. అలాగే ముంబై వచ్చినప్పటి నుంచి మల్లికా నాయక్‌ తనను అమ్మలాగే ఆదరిస్తోందని.. ఈ నలుగురికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పింది. ఇక మనం ఎప్పుడూ పెద్దగా మదర్ ఇండియాను ప్రస్తావించమని, కానీ ఇప్పుడు తన కోసం ప్రార్థించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. భారతమాత నిజంగా గాయపడిందని, త్వరగా నయం కావాలని కోరుకుంటున్నానని చెప్పింది పూజ.

 

Tags:    

Similar News